Kala venkat rao: దొంగ పాస్‌పోర్టులతో కేసీఆర్, దొంగ కంపెనీలతో జగన్ ప్రస్థానాలు ప్రారంభమయ్యాయి: కళా వెంకట్రావు

  • కేసీఆర్ కుట్రలు తెలిసిపోయాయి
  • ఏపీపై హైదరాబాద్‌లో కుట్ర
  • పోలవరంపై కేసు వేయడానికి జగనే కారణం

12 కేసుల్లో ఏ 1 నిందితుడైన వైసీపీ అధినేత జగన్‌కు మద్దతు ఇవ్వడంతోనే ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్రలు ప్రజలకు తెలిసిపోయాయని ఏపీ మంత్రి కళా వెంకట్రావు పేర్కొన్నారు. నేడు ఆయన కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో కేసీఆర్‌పై ఆయన పలు ఆరోపణలు చేశారు. స్వశక్తితో ఎదుగుతున్న ఏపీపై హైదరాబాద్‌లో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

దొంగ పాస్‌పోర్టులతో కేసీఆర్, దొంగ కంపెనీలతో జగన్ ప్రస్థానాలు ప్రారంభమయ్యాయని తన లేఖలో వెంకట్రావు విమర్శించారు. పోలవరం, ఇతర ప్రాజెక్టులపై కేసీఆర్ కేసులు వేయడానికి జగన్ సలహాలే కారణమని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో ఉంటే తమ ఆటలు సాగవనే భయం కేసీఆర్, జగన్‌కు పట్టుకుందని పేర్కొన్నారు.

Kala venkat rao
KCR
Jagan
Chandrababu
Andhra Pradesh
Hyderabad
  • Loading...

More Telugu News