Telangana: తెలంగాణ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి

  • మంత్రిగా బాధ్యతలు స్వీకరణ నాకు సంతోషంగా ఉంది
  • నాకు అవకాశం ఇచ్చిన కేసీఆర్ కు కృతఙ్ఞతలు
  • అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తా

టీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్  సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు సచివాలయంలో తన శాఖకు సంబంధించిన బాధ్యతలను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ ని పలువురు అధికారులు అభినందించారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, మంత్రిగా బాధ్యతలు చేపట్టడం తనకు సంతోషంగా ఉందని, తనకు అవకాశం ఇచ్చిన కేసీఆర్ కు కృతఙ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. కాగా, రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక శాఖల మంత్రిగా వి.శ్రీనివాస్ గౌడ్, కార్మిక ఉపాధి కల్పనా శాఖా మంత్రిగా మల్లారెడ్డి కూడా బాధ్యతలు చేపట్టారు.

Telangana
TRS
ministers
koppula
srinivas
malla reddy
welfare
tourism
employement
  • Loading...

More Telugu News