Andhra Pradesh: దుర్గగుడి ఫ్లైఓవర్ సాధ్యం కాదని కొందరు చెప్పారు.. కానీ మేం చేతల్లో చేసి చూపాం!: కేశినేని నాని

  • గత ఎన్నికల్లో 16 వేల మెజారిటీతో గెలిచా
  • ఇంకో రెండు నెలల్లో దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభం
  • విజయవాడ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాని

గతంలో దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం సాధ్యం కాదని కొందరు చెప్పారనీ, కానీ చేసి చూపామని విజయవాడ పార్లమెంటు సభ్యుడు, టీడీపీ నేత కేశినేని నాని తెలిపారు. గత ఎన్నికల్లో నియోజకవర్గం ప్రజలు తనను 16,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారని గుర్తుచేసుకున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్ ను మరో 2 నెలల్లో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఆయన కుమార్తె షబానా ఖాతూర్ తో కలిసి నాని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 159 సీట్లను దక్కించుకుంటామని జోస్యం చెప్పారు. అలాగే కృష్ణా జిల్లాలోని 16 నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఎన్నో అభివృద్ధి  కార్యక్రమాలు చేపట్టారని ప్రశంసించారు.

Andhra Pradesh
Krishna District
Vijayawada west
Kesineni Nani
jaleel khan
Telugudesam
  • Loading...

More Telugu News