Andhra Pradesh: ఏపీలో ప్రధాని సభ రోజున రైల్వేజోన్ పై ప్రకటన వస్తుందని ఆశిస్తున్నా: బీజేపీ నేత విష్ణుకుమార్

  • విశాఖ రైల్వేజోన్ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే
  • ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలి
  • లేకపోతే, దీన్ని నేనే తీసుకొచ్చానని బాబు అంటారు  

విశాఖ రైల్వేజోన్ ఇచ్చేది తామే, తెచ్చేది తామేనని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖపట్టణంలోని తాటిచెట్లపాలెం వద్ద ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని విష్ణుకుమార్ రాజు, ఎంపీ కంభంపాటి హరిబాబు విన్నారు. ఈ సందర్భంగా మీడియాతో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, రైల్వేజోన్ అంశంపై తాము కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిశామని చెప్పారు.

ఈ విషయమై ఆయన సానుకూలంగా స్పందించారని, ఏపీలో ప్రధాని సభ రోజున లేదా అంతకుముందే రైల్వేజోన్ పై ప్రకటిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని, లేదంటే రైల్వేజోన్ ను తానే తీసుకొచ్చానని చంద్రబాబు శంకుస్థాపన చేసినా చేస్తారని ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ లు తానే తెచ్చానని, అబద్ధాలు చెప్పి చంద్రబాబు శంకుస్థాపన చేశారని ఆరోపించారు. కాగా, ఏపీ బీజేపీ నేతలు పీయూష్ గోయల్ ని ఏపీ బీజేపీ నేతలు నిన్న కలిశారు.

Andhra Pradesh
vishakapatnam
bjp
vishnukumara raju
modi
railway zone
  • Loading...

More Telugu News