Andhra Pradesh: చింతమనేని వీడియో వ్యవహారం.. వైసీపీ కార్యకర్త నాని అరెస్ట్.. బెయిల్ పై విడుదల!

  • దుష్ప్రచారం చేస్తున్నారని చింతమనేని ఫిర్యాదు
  • వైసీపీ నేత రవితో పాటు నాని అరెస్ట్
  • కేసులకు భయపడబోనని నాని స్పష్టీకరణ

దళితులను దూషిస్తున్నట్లు తన వీడియోను ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు రవి జైన్ తో పాటు పార్టీ కార్యకర్త కామిరెడ్డి నానిని పోలీసులు అరెస్ట్ చేశారు. దెందులూరు మండలం శ్రీరామవరంలో నిన్న నానిని పోలీసులు అరెస్ట్ చేసి, ఏలూరు త్రీ టౌన్‌ స్టేషన్‌కు తరలించారు.

విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కామిరెడ్డి నానికి బెయిల్ మంజూరు అయింది. ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడుతూ.. కేసులు, బెదిరింపులకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. చింతమనేని ప్రభాకర్ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు.

Andhra Pradesh
West Godavari District
Chinthamaneni Prabhakar
YSRCP
kamireddy nani
Police
bail
  • Loading...

More Telugu News