Rahul Gandhi: మోదీని లోక్‌సభలో ఎందుకు కౌగిలించుకోవాల్సి వచ్చిందో చెప్పిన రాహుల్

  • ఆందోళనలను ప్రేమతోనే జయించాలి
  • నా కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నా
  • ద్వేషాన్ని ప్రేమ మాత్రమే జయించగలదు

ఆమధ్య లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రసంగించిన అనంతరం.. ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కౌగిలించుకున్న విషయం తెలిసిందే. దీనిపై నేడు రాహుల్ స్పందించారు. తన కుటుంబం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ప్రేమతోనే జయించాలన్న ఉద్దేశంతో అలా చేసినట్టు రాహుల్ తెలిపారు.

దాడుల వలన తన ఇద్దరు కుటుంబ సభ్యులను (తండ్రి, నానమ్మ) పోగొట్టుకున్నానని తెలిపారు. ఆందోళనలు ఎంత మాత్రం పనిచేయవని ఆయన పేర్కొన్నారు. ద్వేషాన్ని ప్రేమ మాత్రమే జయించగలదని రాహుల్ స్పష్టం చేశారు. పార్లమెంటులో తాను మోదీని కౌగిలించుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోతారని తెలుసని.. అసలు ఏం జరిగిందోనని ఆయనకు కూడా అర్థమై ఉండదన్నారు. ఈ సంఘటనతో మోదీ జీవితంలో ప్రేమ లేదని తనకు అనిపించిదన్నారు.  

Rahul Gandhi
Narendra Modi
Pulwama Attack
Parliament
Loksabha
  • Loading...

More Telugu News