kejriwal: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం.. మార్చి 1 నుంచి ఆమరణ దీక్ష

  • ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కోసం నిరాహార దీక్షకు దిగుతున్నా
  • చావును ఎదుర్కోవడానికి కూడా సిద్ధమే
  • ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాలు ఉండవు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కోసం మార్చి 1 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ఆయన ప్రకటించారు. రాష్ట్ర హోదాను సాధించేంత వరకు దీక్షను విరమించబోనని... చావును ఎదుర్కోవడానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, దేశమంతా ప్రజాస్వామ్యం అమలవుతున్నా...ఢిల్లీలో మాత్రం ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నా... ప్రభుత్వానికి అధికారాలు మాత్రం పరిమితంగా ఉంటాయని విమర్శించారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పెత్తనమే నడుస్తుందన్న సంగతి తెలిసిందే.

kejriwal
delhi
hunger strike
aap
  • Loading...

More Telugu News