salman: రెండు దశాబ్దాల తర్వాత.. సల్మాన్ తో సంజయ్ లీలా భన్సాలీ!

  • 'భారత్' షూటింగులో సల్మాన్ 
  • తదుపరి సినిమా సంజయ్ లీలా భన్సాలీ తో
  • 20 యేళ్ల తరువాత కుదిరిన కాంబినేషన్        

'పద్మావత్'తో భారీ చారిత్రక చిత్రాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన సంజయ్ లీలా భన్సాలీ, సంచలన విజయాన్ని సాధించారు. ఆ తరువాత ఏడాదిగా ఆయన ఒక ప్రేమకథపై కసరత్తు చేస్తూ వచ్చారు. ఈ ప్రేమకథను సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా ఆయన రూపొందించనున్నాడనేది తాజా సమాచారం.

1999లో సల్మాన్ ఖాన్ హీరోగా ఆయన 'హమ్ దిల్ దే చూకే సనమ్' చేసిన సంగతి తెలిసిందే. 20 సంవత్సరాల తరువాత మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అవుతోందన్న మాట. త్వరలోనే ఈ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సల్మాన్ 'భారత్' సినిమాలో నటిస్తున్నారు. 'రంజాన్' సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో .. ఆ దిశగా పనులు కానిస్తున్నారు. ఈ సినిమా తరువాత సల్మాన్ .. సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్లోని సినిమా మొదలవుతుందన్న మాట.

  • Loading...

More Telugu News