Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ ప్రత్యేకహోదా యాత్రను అడ్డుకున్న వైసీపీ.. రంగంలోకి దిగిన పోలీసులు!

  • వెంకటగిరి క్రాస్ రోడ్స్ వద్ద ఘటన
  • నల్లజెండాలతో వైసీపీ శ్రేణుల నిరసన
  • కాంగ్రెస్ గో బ్యాక్, రాష్ట్ర విభజన ద్రోహి అంటూ నినాదాలు

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఈరోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ప్రత్యేకహోదా భరోసా యాత్ర’ను వెంకటగిరి క్రాస్ రోడ్స్ వద్ద వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. కాంగ్రెస్ నేతల బస్సును నల్ల జెండాలతో చుట్టుముట్టిన వైసీపీ కార్యకర్తలు.. ‘రాష్ట్ర విభజన ద్రోహి’ ‘కాంగ్రెస్ గో బ్యాక్’ ‘కాంగ్రెస్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోటీగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ఇరుపార్టీలకు చెందిన నేతలను శాంతింపజేశారు.

Andhra Pradesh
Nellore District
Congress
bus yatra
Police
YSRCP
black flags
  • Loading...

More Telugu News