Andhra Pradesh: తెలుగుదేశం పార్టీని నేను వీడటం లేదు.. నరసాపురం లోక్ సభ సీటు నాదే!: రఘురామ కృష్ణంరాజు

  • పార్టీలో చేరినప్పుడే క్లారిటీ ఉంది
  • మళ్లీ ఏపీలో టీడీపీదే అధికారం
  • ఏలూరులో మీడియా సమావేశం నిర్వహించిన నేత

టీడీపీని వీడి మరో పార్టీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆ పార్టీ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు ఖండించారు. తాను టీడీపీలోనే కొనసాగుతాననీ, ఈ విషయంలో పార్టీలో చేరినప్పుడే తనకు పూర్తి క్లారిటీ ఉందని వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో నరసాపురం స్థానం నుంచి తానే పోటీ చేస్తాననీ, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని రఘురామ కృష్ణంరాజు జోస్యం చెప్పారు. గతేడాది మే నెలలో బీజేపీకి రఘురామ కృష్ణంరాజు రాజీనామా సమర్పించారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలోనే ఏపీకి న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించి టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయనకు నరసాపురం లోక్ సభ టికెట్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

Andhra Pradesh
Telugudesam
Chandrababu
West Godavari District
ELURU
narasapuram loksabha seat
  • Loading...

More Telugu News