ntr: ఎన్టీఆర్, వైయస్సార్ బయోపిక్ లపై వెంకయ్యనాయుడి స్పందన

  • 'కథానాయకుడు', 'యాత్ర' సినిమాలను చూశా
  • రెండు సినిమాలూ బాగున్నాయి
  • ప్రొటోకాల్ వల్ల ప్రజల్లోకి రాలేకపోతున్నా

దివంగత ఎన్టీఆర్, వైయస్ రాజశేఖరరెడ్డిల బయోపిక్ లపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. 'కథానాయకుడు', 'యాత్ర' సినిమాలను తాను చూశానని చెప్పారు. రెండు సినిమాలూ బాగున్నాయని తెలిపారు. నెల్లూరులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశ భక్తి అంటే ఎవరి పని వారు చేసుకోవడమేనని వెంకయ్య అన్నారు. ప్రతి ఒక్కరికీ సమయపాలన, క్రమశిక్షణ ఉండాలని చెప్పారు. ప్రజల మధ్యలో ఉండటమే తనకు ఇష్టమని... కానీ, ఉపరాష్ట్రపతి ప్రొటోకాల్ వల్ల ప్రజల్లోకి రాలేకపోతున్నానని చెప్పారు. ఇది ఇబ్బందిగా అనిపిస్తున్నా తప్పదని అన్నారు.

ntr
ysr
biopic
Venkaiah Naidu
tollywood
  • Loading...

More Telugu News