vidya balan: భారత్ లో పాకిస్థానీ నటీనటులను బ్యాన్ చేయడంపై విద్యాబాలన్ స్పందన!

  • రాజకీయాలకు, సరిహద్దులకు అతీతమైనవి కళలు
  • కానీ, ఈ భావన నుంచి బయటకు రావాల్సి ఉంది
  • భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు

పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని బాలీవుడ్ ముక్తకంఠంతో ఖండించింది. అంతేకాదు పాకిస్థాన్ లో తమ సినిమాలను విడుదల చేయరాదని నిర్ణయించింది. పాకిస్థానీ నటీనటులు బాలీవుడ్ చిత్రాల్లో నటించకుండా నిషేధం విధించింది.

పాకిస్థానీ యాక్టర్లపై నిషేధం విధించడంపై బాలీవుడ్ నటి విద్యాబాలన్ స్పందించింది. 'వాస్తవానికి కళలకు సరిహద్దులు ఉండవు. రాజకీయాలకు, సరిహద్దులకు అతీతమైనవి కళలు. సంగీతం, సినిమా, నాట్యం, నాటకాలు, పొయెట్రీ తదితర కళలు ప్రజలను దగ్గర చేస్తాయి. అయితే, ఈ భావన నుంచి తాత్కాలికంగా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు జరిగింది చాలు. భవిష్యత్తు కోసం ఇప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోక తప్పదు.' అని విద్యాబాలన్ వ్యాఖ్యానించింది.

vidya balan
bollywood
pulwama
Pakistan
artists
ban
  • Loading...

More Telugu News