Andhra Pradesh: కోడి కత్తి కేసులో రహస్య విచారణకు ఎన్ఐఏ కోర్టు ఆదేశం.. ఇక వార్తలు బయటకు రాకూడదన్న ధర్మాసనం

  • గతేడాది అక్టోబరు 25న జగన్‌పై దాడి
  • విచారణ విషయాలు బయటకు వెల్లడి కావొద్దన్న కోర్టు
  • నిందితులు, న్యాయవాదుల భద్రత దృష్ట్యా ఆదేశాలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐయే) కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ కేసును రహస్యంగా విచారించాలని విజయవాడలోని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిందితులు, న్యాయవాదుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అంతేకాదు, కోర్టులో జరిగే విచారణకు సంబంధించిన వివరాలను ఎలక్ట్రానిక్, ప్రింట్ మాధ్యమాల్లో ప్రచురణ చేయడానికి వీల్లేదని పేర్కొంది.  

జగన్‌పై గతేడాది అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి జరిగింది. ఈ కేసును  రాష్ట్ర ప్రభుత్వం సరిగా దర్యాప్తు చేయలేదని, ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దాడి జరిగిన ప్రదేశం (విమానాశ్రయం లాంజ్‌) కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది కాబట్టి జాతీయ సంస్థలకు ఇవ్వొచ్చని భావించిన ధర్మాసనం కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది.  

Andhra Pradesh
Visakhapatnam District
Jagan
YSRCP
NIA Court
Kodi kathi
  • Loading...

More Telugu News