Nagul Meera: టీడీపీ అధిష్ఠానం వైఖరిపై అసంతృప్తి.. రాజీనామా చేసే యోచనలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగూర్ మీరా!

  • బీజేపీ కోసం సీటు త్యాగం చేశా
  • వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్
  • నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు

టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగూర్ మీరా ఉన్నట్టు తెలుస్తోంది. తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదని భావిస్తున్న ఆయన టీడీపీ అధిష్ఠానం వైఖరి పట్ల ఆగ్రహంతో ఉన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి సైతం రాజీనామా చేసే యోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ కోసం తన సీటును త్యాగం చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ నుంచి వచ్చిన నేతలకు టికెట్ కేటాయిస్తూ తనను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ నాగూర్ మీరా వాపోయారు. కనీసం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా తనను సంప్రదించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటి నేపథ్యంలో ఆయన రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. దీనిపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Nagul Meera
Telugudesam
BJP
YSRCP
Vijyayawada
  • Loading...

More Telugu News