Dasari narayana rao: గొప్ప దర్శకుడు దాసరికి అంత దగ్గరగా ఉండే మరో దర్శకుడు కోడి రామకృష్ణ : పరుచూరి గోపాలకృష్ణ

  • ఎన్నో రకాల కథనాలను సెల్యులాయిడ్ పై చూపించారు
  • నటులు కాని వాళ్లను నటులను చేశారు
  • గొల్లపూడి, రామిరెడ్డి, కాస్ట్యూమ్ కృష్ణలే ఉదాహరణ

నటులు కాని వాళ్లను నటులను చేసిన ఘనత దర్శకుడు కోడి రామకృష్ణదని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. గొల్లపూడి మారుతీరావు, రామిరెడ్డి, కాస్ట్యూమ్ కృష్ణలే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ‘పోరాటం’, ‘జైలు పక్షి’ వంటి సినిమాలకు ఆయనతో కలిసి పనిచేసినట్టు చెప్పారు.

మహాభారతంలో ద్రోణాచార్యుడిని జయించే వాళ్లు ఎవరైనా ఉన్నారా అని చూస్తే, ఆయన శిష్యుడు అర్జునుడు కనబడ్డట్టుగా, గొప్ప దర్శకుడు దాసరి నారాయణరావుకు అంత దగ్గరగా ఉండే మరో దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఆయన శిష్యుడు కోడి రామకృష్ణేనని కొనియాడారు. ఎన్నో రకాల కథనాలను సెల్యులాయిడ్ పై ఆయన చూపించారోనని ప్రశంసించారు.

Dasari narayana rao
director
kodi rama krishna
tfi
paruchuri
gopala krishna
rami reddy
gollapudi
  • Loading...

More Telugu News