kodi ramakrishna: గొప్ప దర్శకుడు.. ఆయన మరణం కలచివేస్తోంది: బాలకృష్ణ

  • గొప్ప దర్శకుడిని కోల్పోవడం సినీ పరిశ్రమకు తీరని లోటు
  • ఆయనతో కలసి ఎన్నో సినిమాలు చేశాను
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా

దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూయడం ఎంతో బాధాకరమని నందమూరి బాలకృష్ణ అన్నారు. అనారోగ్యంతో తుదిశ్వాస విడవటం కలచివేస్తోందని చెప్పారు. వందకు పైగా చిత్రాలకు దర్శకుడిగా, ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన అందించారని అన్నారు. ఎమోషనల్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకులలో ఆయన కూడా ఒకరని చెప్పారు. ట్రెండ్ కు తగ్గట్టుగా గ్రాఫిక్స్ తో కూడిన చిత్రాలను తెరకెక్కించారని కొనియాడారు.

కోడి రామకృష్ణతో కలసి మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మామయ్య, ముద్దుల మేనల్లుడు, భారతంలో బాలచంద్రుడు, మువ్వగోపాలుడు, బాలగోపాలుడు చిత్రాలకు పని చేశానని బాలకృష్ణ చెప్పారు. గొప్ప దర్శకుడిని కోల్పోవడం సినీ పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

kodi ramakrishna
balakrishna
tollywood
  • Loading...

More Telugu News