Andhra Pradesh: చింతమనేనీ.. దళితులపై వెధవ కూతలు కూస్తే నాలుక కోస్తాం!: అమలాపురం ఎంపీ రవీంద్రబాబు

  •  ప్రభుత్వ విప్ కు వైసీపీ నేత ఘాటు వార్నింగ్
  • దళితులు రాజకీయ సమాధి చేస్తారని స్పష్టీకరణ
  • జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయడంపై మద్దతు

టీడీపీ నేత చింతమనేనిని దళితులు రాజకీయంగా సమాధి చేస్తారని వైసీపీ నేత, అమలాపురం పార్లమెంటు సభ్యుడు రవీంద్ర బాబు హెచ్చరించారు. చింతమనేనితో పాటు కులగజ్జి ఉన్న నేతలందరికీ దళితులు బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. దళితుల గురించి వెధవ కూతలు కూస్తే నాలుక కోస్తామని వార్నింగ్ ఇచ్చారు.

మరోవైపు దళితులపై చింతమనేని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించారు. దీనిపై రవీంద్ర బాబు స్పందిస్తూ.. తాను అనిల్ కుమార్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన రవీంద్ర బాబు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Chinthamaneni Prabhakar
ravindra pandula
  • Loading...

More Telugu News