sruthi hassan: శ్రుతి హాసన్ తో కలిసి నటించాలని వుంది: తమన్నా

  • శ్రుతి హాసన్ అంటే ఇష్టం 
  • తను బాగా అల్లరి చేస్తుంది
  • ఆమెతో వుంటే సమయమే తెలియదు     

తెలుగు .. తమిళ భాషల్లో అగ్రకథానాయికలుగా పేరు తెచ్చుకున్న తమన్నా .. కాజల్ .. శ్రుతి హాసన్, బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. ఈ ముగ్గురూ మంచి స్నేహితులు .. ఏదైనా వేడుకలో కలిశారంటే సందడే సందడి. తమ స్నేహాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో తమన్నా ఇలా స్పందించింది.

"మేము ముగ్గురమూ కలుసుకున్నామంటే సమయమే తెలియదు. ఏదైనా ఒక చిలిపి పని చేయాలనుకుంటే, నా పక్కన కాజల్ కంటే శ్రుతి హాసన్ వుంటే బాగుండునని అనిపిస్తుంది. అవసరమైతే వెంటనే శ్రుతికి ఫోన్ చేసి పిలిపిస్తాను. శ్రుతి హాసన్ తో కలిసి నటించాలని ఆశగా వుంది. ఒకవేళ మరో హీరోయిన్ తో కలిసి నటించవలసి వస్తే, అవతలి హీరోయిన్ శ్రుతి కావాలని కోరుకుంటాను. ఇద్దరు కథానాయికలకు సంబంధించిన కథలను ఎవరు వినిపిస్తారా అని ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. ఈ విషయం శ్రుతి వరకూ వెళ్లడంతో .. థ్యాంక్స్ చెబుతూ .. 'త్వరలోనే మనమిద్దరం కలిసి ఓ సినిమా చేద్దాం' అంటూ మాట ఇచ్చింది.

sruthi hassan
  • Loading...

More Telugu News