satyaveedu: ఎమ్మెల్యే టికెట్ కోసం చంద్రబాబును కలిసిన సినీ నిర్మాత

  • అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్న చంద్రబాబు
  • టీడీపీలో నెలకొన్న టికెట్ల సందడి
  • సత్యవేడు టికెట్ ఇవ్వాలని బాబును కోరిన ఎంపీ శివప్రసాద్ పెద్దల్లుడు

రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి తొలి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో... అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో టికెట్ల సందడి నెలకొంది.

చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పెద్దల్లుడు గుంతాటి వేణుగోపాల్ కూడా చంద్రబాబును కలసి వినతి పత్రాన్ని అందించారు. సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ ను తనకు కేటాయించాలని విన్నవించారు. ఇప్పటి వరకు తాను చేసిన సేవలను కూడా బాబుకు వివరించారు. వ్యాపారవేత్త అయిన వేణుగోపాల్ పలు సినిమాలను కూడా నిర్మించారు. మరోవైపు, ఎంపీ శివప్రసాద్ రెండో అల్లుడు నరసింహ ప్రసాద్ కు రైల్వే కోడూరు అభ్యర్థిత్వం ఖరారైంది.

satyaveedu
Chandrababu
Telugudesam ticket
mp sivaprasad
  • Loading...

More Telugu News