Goa: డగ్స్‌తో పట్టుబడిన ఘనా మహిళ.. హైదరాబాద్‌లో కలకలం

  • గోవా నుంచి నగరానికి డ్రగ్స్‌తో వచ్చిన మహిళ
  • 50 గ్రాముల కొకైన్, 10 గ్రాముల ఎక్సటేషియా స్వాధీనం
  • మహిళ పాస్‌పోర్టు స్వాధీనం

హైదరాబాద్ సోమాజీగూడలో ఘనా దేశానికి చెందిన మహిళ డ్రగ్స్‌తో పట్టుబడింది. గోవా నుంచి కొకైన్‌ను తీసుకొస్తున్న జెనీవే ఆల్టో అనే మహిళను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఆమె నుంచి 50 గ్రాముల కొకైన్, 10 గ్రాముల ఎక్సటేషియాను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ మాఫియా ఆదేశాలతోనే ఆమె వాటిని సరఫరా చేసేందుకు హైదరాబాద్ వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. జెనీవే  నుంచి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రగ్స్‌ను ఎవరికి సరఫరా చేయబోతోంది.. ముఠాలో ఇంకా ఎంతమంది ఉన్నారు? అనే విషయాలను ఆమె నుంచి రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Goa
Hyderabad
Cocaine
Ghana
Police
Drugs
  • Loading...

More Telugu News