Andhra Pradesh: రాయచోటి, పీలేరు, పుంగనూరు టీడీపీ అభ్యర్థుల ప్రకటన!

  • రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో ముగిసిన భేటీ
  • రాయచోటి నుంచి రమేశ్ కుమార్ రెడ్డి
  • పీలేరు నుంచి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
  • పుంగనూరు నుంచి అనూష రెడ్డి

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగనున్న అభ్యర్థుల పేర్లను సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాజంపేట నుంచి చెంగల్రాయుడు, రాయచోటి నుంచి రమేశ్ కుమార్ రెడ్డి, పీలేరు నుంచి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు నుంచి అనూషరెడ్డి పేర్లను ప్రకటించారు.

తంబళ్లపల్లి సీటు కేటాయింపుపై చంద్రబాబు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. వారంలోగా మిగతా నియోజకవర్గాల అభ్యర్థులపై చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకుంటాని పార్టీ వర్గాల సమాచారం.

కాగా, మైదుకూరు అసెంబ్లీ టికెట్ తనకు ఇవ్వాలని చంద్రబాబుని డీఎల్ రవీంద్రారెడ్డి కోరారు. నిన్న పొద్దుపోయాక చంద్రబాబును ఆయన కలిశారు. అయితే, ఇదే సీటు కోసం టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.

Andhra Pradesh
cuddapah
rajampet
punganuru
  • Loading...

More Telugu News