roja: మోదీని రాజీనామా చేయాలనడం చంద్రబాబు దిగజారుడుతనం: రోజా

  • పుష్కరాల్లో 30 మంది చనిపోతే చంద్రబాబు రాజీనామా చేశారా?
  • జగన్, కేసీఆర్ లు కుట్ర చేస్తే టీడీపీలో ఒక్కరు కూడా మిగలరు
  • చింతమనేనిపై చంద్రబాబు చర్యలు ఎందుకు తీసుకోలేదు?

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రధాని మోదీ రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు. పుష్కరాల సమయంలో 30 మంది చనిపోతే చంద్రబాబు రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు.

వైసీపీ అధినేత జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు కలిసి కుట్రలు చేస్తున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారని... వీరిద్దరూ కలిసి కుట్ర చేస్తే టీడీపీలో ఒక్క నాయకుడు కూడా మిగలరని అన్నారు. చంద్రబాబు విధానాలు నచ్చకపోవడం వల్లే టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారని చెప్పారు. దళితులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

roja
jagan
ysrcp
kcr
TRS
Chandrababu
Chinthamaneni Prabhakar
Telugudesam
modi
bjp
pulwama
  • Loading...

More Telugu News