Heat: ఈ వేసవిలో తొలిసారిగా అప్పుడే 37 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత!

  • ఖమ్మం జిల్లాలో 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత
  • హైదరాబాద్ లోనూ దాదాపు అంతే
  • రాత్రి ఉష్ణోగ్రత 5 డిగ్రీల వరకూ పెరుగుదల

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. చలి తగ్గి వారం రోజులు గడిచిందో లేదో, అప్పుడే వేడి, ఉక్కపోత మొదలయ్యాయి. నిన్న మధ్యాహ్నం ఈ సీజన్ లో తొలిసారిగా ఉష్ణోగ్రత 37 డిగ్రీలను దాటింది. పశ్చిమ భారతం నుంచి రావాల్సిన గాలులు రాకపోవడంతోనే వేడి పెరిగినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌, కామారెడ్డి జిల్లా లింగంపేటలో 37.6 డిగ్రీలు, సికింద్రాబాద్‌ లో 37.3 డిగ్రీల వేడిమి నమోదైంది. ఇదే సమయంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలూ పెరిగాయి. రాత్రిపూట సాధారణంతో పోలిస్తే రెండు నుంచి 5 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రత పెరిగింది.

కాగా, గత సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీల వరకూ నమోదు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News