Dhaka: బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 56 మంది సజీవ దహనం

  • రసాయన గోదాంలో చెలరేగిన మంటలు
  • రాత్రి నుంచి కొనసాగుతున్న సహాయక చర్యలు
  • పదుల సంఖ్యలో క్షతగాత్రులు

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బుధవారం అర్ధరాత్రి సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో 56 మంది సజీవ దహనమయ్యారు. మరో 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఓ భవనంలోని కెమికల్ గోదాంలో చెలరేగిన మంటలు క్షణాల్లోనే చుట్టుపక్కల భవనాలకు వ్యాపించాయి. మంటలు చెలరేగిన ప్రాంతం ఇరుగ్గా ఉండడం, భవనాల మధ్య దూరం తక్కువగా ఉండడంతో మంటలు ఓ భవనం నుంచి మరో భవనంలోకి త్వరగా వ్యాపించాయి.  

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రాత్రి నుంచి మంటలను అదుపు చేస్తూనే ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫైర్ సర్వీస్ చీఫ్ అలీ అహ్మద్ తెలిపారు. భవనాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు చౌక్ బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా ఉందని, మంటల ధాటికి పలువురు ప్రయాణికులు కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు.  

Dhaka
Bangladesh
Fire Accident
Massive fire
Chemical
  • Loading...

More Telugu News