Telangana: టీ-మంత్రి తలసానిని కలిసిన ఏపీ టీడీపీ నేత తోట త్రిమూర్తులు

  • హైదరాబాద్ లోని తలసాని నివాసానికి వెళ్లిన తోట
  • ఏపీ రాజకీయాలపై చర్చించినట్టు సమాచారం
  • తలసానిని తోట కలవడంపై రాజకీయ చర్చ 

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఏపీ టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఈరోజు కలిశారు. హైదరాబాద్ లోని తలసాని నివాసానికి తోట త్రిమూర్తులు వెళ్లారు. ఏపీ రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించినట్టు సమాచారం. కాగా, తలసానిని తోట త్రిమూర్తులు కలవడంపై రాజకీయంగా చర్చకు తావిచ్చింది. ఇదిలా ఉండగా, టీడీపీని తోట త్రిమూర్తులు వీడనున్నారని, వైసీపీలో చేరతారన్న ఊహాగానాలు కొద్ది రోజులుగా వినవస్తున్నాయి. ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్, ఆ పార్టీని వీడే ముందు తోట త్రిమూర్తులను కలిశారు.

Telangana
Andhra Pradesh
talasani
TRS
Telugudesam
Thota Trimurthulu
YSRCP
aamanchi krishna mohan
  • Loading...

More Telugu News