Chandrababu: చంద్రబాబు అండతోనే చింతమనేని ఇలా వ్యవహరిస్తున్నారు: వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్

  • దళితులపై చింతమనేని వ్యాఖ్యలపై రోజా నిరసన
  • అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటే
  • చింతమనేనిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి

దళితులపై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యే రోజా ఖండించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం చింతమనేనికి అలవాటుగా మారిందని విమర్శించారు. చంద్రబాబు అండతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన చింతమనేనిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, దళితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా చేయని పక్షంలో దళితులతో కలిసి ఉద్యమిస్తామని రోజా హెచ్చరించారు.

Chandrababu
Chinthamaneni Prabhakar
YSRCP
roja
  • Loading...

More Telugu News