Pulwama Attacks: కపిల్ శర్మ షో నుంచి సిద్ధూ తొలగింపుపై నిర్ణయం వాయిదా?

  • తుది నిర్ణయం తీసుకోని సల్మాన్
  • రేటింగ్స్ పడిపోవడం ఇష్టంలేక వాయిదా
  • షూటింగ్‌లకు హాజరుకాని సిద్ధూ 

పుల్వామా దాడులకు సంబంధించి నవజ్యోత్ సింగ్ సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దాడులను ఖండిస్తూనే, కొందరు చేసిన తప్పుకి పాకిస్థాన్ మొత్తాన్ని నిందించడం తప్పని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంతో ప్రముఖ టీవీ ప్రోగ్రాం కపిల్ శర్మ ‘షో’ నుంచి సిద్ధూని తొలగించినట్టు వార్తలొచ్చాయి. కానీ దీనిపై షో నిర్మాత సల్మాన్ ఖాన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

అయితే నిజంగానే సిద్ధూని సల్మాన్ రాజీనామా చేయమన్నారని, కానీ ఒక్కరి కారణంగా షో రేటింగ్స్ పడిపోవడం ఇష్టంలేక, దీనిపై చెలరేగిన దుమారం చల్లారే వరకూ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు జాతీయా మీడియా కథనాన్ని ప్రచురించింది. ఈ విషయాన్ని సల్మాన్ సన్నిహిత వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ప్రస్తుతానికైతే సిద్ధూ షూటింగ్‌లకు హాజరు కావడం లేదు కానీ, తిరిగి ఆయన కపిల్ శర్మ పోలో పాల్గొనే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Pulwama Attacks
Pakistan
Siddu
Salman Khan
Kapil Sharma
  • Loading...

More Telugu News