Tulasi: 9వ తరగతి బాలికను కిడ్నాప్ చేసిన ఇంటర్ అబ్బాయిలు... సత్తెనపల్లిలో కలకలం!

  • నాలుగు రోజుల క్రితం ఘటన
  • మరుసటి రోజే వదిలేసిన విద్యార్థులు
  • ఇంతవరకూ ఇంటికి రాని తులసి
  • ప్రత్యేక బృందాలను దించిన పోలీసులు

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 9వ తరగతి చదువుతున్న తులసి అనే బాలిక కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరుగగా, ఆమెను ఇంటర్ చదువుతున్న ప్రశాంత్, మార్క్ అనే ఇద్దరు విద్యార్థులు కిడ్నాప్ చేసి తీసుకెళుతున్నట్టు పలు సీసీటీవీ ఫుటేజీల్లో పోలీసులు గుర్తించారు. వారిని ట్రేస్ చేస్తుండగానే, తిరిగి వారే ఆమెను మరుసటి రోజు సత్తెనపల్లి క్రాస్ రోడ్డు వద్ద వదిలి వెళ్లినట్టు కనిపించింది.

 అయితే, తులసి ఇంతవరకూ ఇంటికి రాలేదు. తులసిని విడిచిపెట్టి వెళుతున్న ప్రశాంత్, మార్క్ ల ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు, ఆపై ఆమె ఎటు వెళ్లిందన్న విషయాన్ని మాత్రం తేల్చలేకపోతుండటంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసులో ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, తులసి ఎక్కడుందో కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

Tulasi
Kidnap
Sattenapalli
Police
Guntur District
  • Loading...

More Telugu News