Telugudesam: టీడీపీకి జ్ఞానోదయం కలిగింది.. వైసీపీ మోసం చేస్తోంది: రఘువీరా

  • ఎస్వీ యూనివర్శిటీ మైదానంలో రాహుల్ సభ నిర్వహిస్తాం
  • మోదీ ద్రోహం చేసిన చోట రాహుల్ భరోసా ఇస్తారు
  • మోదీని వైసీపీ కనీసం ప్రశ్నించడం కూడా లేదు

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ మైదానంలోనే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సభను నిర్వహిస్తామని... ఆ సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామనే ప్రకటనను రాహుల్ చేస్తారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా అన్నారు. మోదీ ద్రోహం చేసిన స్థలంలోనే రాహుల్ భరోసా ఇస్తారని చెప్పారు.

ప్రత్యేక హోదాపై పార్లమెంటు సాక్షిగా సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. బీజేపీ మోసం చేస్తోందన్న జ్ఞానోదయం టీడీపీకి కలిగిందని, అందుకే కాంగ్రెస్ తో చేయి కలిపిందని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోదీని వైసీపీ కనీసం ప్రశ్నించడం కూడా లేదని... హోదాపై సంతకం చేసే వారికే తమ మద్దతు అంటూ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు ఉందని... ఏపీలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు.

Telugudesam
ysrcp
raghuveera reddy
modi
Rahul Gandhi
bjp
congress
  • Loading...

More Telugu News