KTR: ఫన్నీ వీడియోను ట్వీట్ చేసిన కేటీఆర్... నవ్వులే నవ్వులు!

  • 'స్మార్టెస్ట్‌ గై అవార్డు గోస్‌ టూ...' అంటూ వీడియో
  • స్మార్ట్ ఫోన్ కోసం యువకుల ప్రయత్నం
  • వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ, తన దృష్టికి వచ్చిన సమస్యలకు పరిష్కారం చూపుతూ, అప్పుడప్పుడూ తనలోని హ్యూమర్ ను బయటకు తెచ్చే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ వేదికగా మరోసారి నవ్వులు పూయించారు. తన ఖాతాలో ఆయన ఓ ఫన్నీ వీడియోను పోస్టు చేయడంతో అదిప్పుడు వైరల్ అవుతోంది. 'స్మార్టెస్ట్‌ గై అవార్డు గోస్‌ టూ...' అంటూ కేటీఆర్ చేసిన ఈ వీడియోలో, కంచెకు అవతలివైపు పడిపోయిన ఓ స్మార్ట్ ఫోన్ ను తీసుకునేందుకు ఇద్దరు యువకులు చేస్తున్న ప్రయత్నం కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఆ వీడియోను చూసి మీరూ నవ్వుకోండి.



KTR
Twitter
Funny Video
Viral Videos
  • Loading...

More Telugu News