Amaravati: ఒంటరిగా ఉంటే ఒకలా... పోలీసులు వస్తే మరోలా... జ్యోతి హత్య కేసు నిందితుడు శ్రీనివాస్ మహా ముదురు!

  • అమరావతిలో తీవ్ర కలకలం రేపిన జ్యోతి హత్య
  • ఆసుపత్రి గదిలో సీసీ కెమెరా అమర్చిన పోలీసులు
  • శ్రీనివాస్ అశ్లీల వీడియోలు చూస్తున్నట్టు వెల్లడి

అమరావతిలో తీవ్ర కలకలం రేపిన జ్యోతి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా పోలీసులు నిర్ధారణకు వచ్చిన ఆమె ప్రియుడు శ్రీనివాస్ మహాముదురని ఉన్నతాధికారులు అంటున్నారు. హత్య తరువాత తనపై అనుమానం రాకూడదన్న ఉద్దేశంతో, తనపైనా దాడి చేయించుకుని గాయాన్ని భరిస్తూ, దాదాపు వారం రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ గదిలో పోలీసులు రహస్యంగా సీసీ కెమెరాను అమర్చారు.

దీని ద్వారా అతని నడవడికను పరిశీలించిన పోలీసులు విస్తుపోతున్నారు. పోలీసులు ఉన్నప్పుడు ఒకలా, పోలీసులు లేనప్పుడు మరోలా శ్రీనివాస్ ప్రవర్తిస్తున్నాడని, ఒంటరిగా ఉన్న సమయంలో యూ ట్యూబ్ లో అశ్లీల వీడియోలను చూస్తూ కాలం గడుపుతున్నాడని పోలీసులు వెల్లడించారు. శ్రీనివాస్ మహా ముదురని, అతని మెయిల్ బ్యాకప్ లో పలువురు అమ్మాయిల నగ్న వీడియోలను దాచుకుని, వాటిని తీరిక సమయాల్లో చూస్తున్నాడని అన్నారు. ఈ కేసులో శ్రీనివాస్ కు కఠినమైన శిక్ష పడేలా చూస్తామని, అందుకోసం బలమైన ఆధారాలను ఇప్పటికే సేకరించామని తెలిపారు.

Amaravati
Jyothi
Srinivas
You Tube
Hospital
Murder
CC Tv Cam
Police
  • Loading...

More Telugu News