chinarajappa: మరో ఇద్దరు లేదా ముగ్గురు పార్టీని వీడే అవకాశం ఉంది!: ఏపీ హోంమంత్రి చినరాజప్ప

  • వీళ్లంతా ఆరు నెలలుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు:
  • కొందరు పోయినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదు
  • శవరాజకీయాలు చేయడం వైసీపీ, బీజేపీల నైజం

టికెట్ రాని వాళ్లే పార్టీ మారుతున్నారని ఏపీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. పార్టీని వీడుతామని వీళ్లంతా గత ఆరు నెలలుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి మరో ఇద్దరు లేదా ముగ్గురు తెలుగుదేశం పార్టీని వీడే అవకాశం ఉందని చెప్పారు. కొందరు నేతలు వెళ్లిపోయినా పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని... టీడీపీదే మళ్లీ విజయమని ధీమా వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట అని చెప్పారు.

ప్రజల ప్రాణాలను కాపాడేందుకే పోలీసులు ఉన్నారని చినరాజప్ప తెలిపారు. కొండవీడులో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కోటేశ్వరరావును కాపాడేందుకు పోలీసులు అన్నివిధాలా ప్రయత్నించారని చెప్పారు. చంపడం, శవరాజకీయం చేయడం వైసీపీ, బీజేపీల నైజమని విమర్శించారు.

chinarajappa
Telugudesam
ysrcp
bjp
East Godavari District
  • Loading...

More Telugu News