trivikram: త్రివిక్రమ్ గారు నన్నేం పిలవలేదు: హైపర్ ఆది వివరణ

  • త్రివిక్రమ్ గారితో పోల్చడం సంతోషం
  • ఆయనని ఒకటి రెండుసార్లు కలిశాను
  • ఆయన నన్నెప్పుడూ అడగలేదు            

'జబర్దస్త్' కామెడీ షోతో హైపర్ ఆది బాగా పాప్యులర్ అయ్యాడు. ఒక వైపున 'జబర్దస్త్' చేస్తూనే మరో వైపున సినిమాలు కూడా చేసేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే .. తన సినిమాకి మాటలు రాయడానికి త్రివిక్రమ్ నుంచి హైపర్ ఆదికి పిలుపు వచ్చిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. త్రివిక్రమ్ బిజీగా ఉండటం వల్లనే ఆదికి ఛాన్స్ ఇస్తూ ఉండొచ్చనే టాక్ వినిపించింది. దాంతో తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై హైపర్ ఆది స్పందించాడు.

 'జబర్దస్త్' కామెడీ షోలో నేను వేసే పంచ్ లు నచ్చడం వలన, చాలామంది నన్ను త్రివిక్రమ్ తో పోల్చారు. ఇప్పుడేమో ఆయన నుంచి పిలుపు వచ్చిందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అలాంటిదేం లేదు. త్రివిక్రమ్ గారిని రెండు మూడు సార్లు కలిశాను .. అదీ ఆయన మీద అభిమానంతోనే. తన సినిమాకి మాటలు రాయమని ఆయన నన్నెప్పుడూ అడగలేదు .. ఆయనకి ఆ అవసరం లేదు కూడా. తన సినిమాలకి తనే కథ .. మాటలు రాసుకునే సమర్థత ఆయన సొంతం. ఆయనతో పోల్చడం మాత్రం నాకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.

trivikram
aadi
  • Loading...

More Telugu News