Pulwama: అంతిమయాత్రలో పుల్వామా అమరుడి బంధువుపై బీజేడీ ఎమ్మెల్యే దాడి

  • బీజేడీ ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తన
  • సర్వత్ర విమర్శలు
  • దిష్టిబొమ్మల దహనం

పుల్వామా అమరులకు దేశం మొత్తం నివాళులు అర్పిస్తుంటే ఒడిశాలోని బీజేడీ ఎమ్మెల్యే అతి చేశారు. అమరుడు మనోజ్ బెహరా  అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే.. మనోజ్ అంకుల్‌ ఆర్తత్రాన బెహరాపై భౌతిక దాడికి దిగి అవమానించారు. రత్నాపూర్‌లో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది.

కటక్-బారాబతి ఎమ్మెల్యే సమంతరాయ్ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి అమరుడి అంతిమయాత్రలో పాల్గొన్నారు. అమరుడి అంకుల్‌పై సమంత్‌రాయ్ దాడి చేస్తున్నప్పుడు ఆరోగ్యమంత్రి ప్రతాప్ జెనా పక్కనే ఉన్నప్పటికీ కిమ్మనకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అంతిమయాత్రలో భౌతిక దాడికి దిగిన ఎమ్మెల్యేపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమంత్‌రాయ్ దిష్టిబొమ్మలను బీజేపీ నేతలు తగలబెట్టి ఆందోళనకు దిగారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలా ప్రవర్తించడం ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు.

Pulwama
terror attack
insult
Odisha
BJD MLA
  • Loading...

More Telugu News