jaish e mohammed: పుల్వామా దాడి తమ పనేనంటూ రెండో వీడియోను విడుదల చేసిన జైషే

  • పుల్వామా దాడితో తమకు సంబంధం లేదన్న పాక్ ప్రధాని
  • ఎప్పుడు కావాలంటే అప్పుడు దాడి చేస్తామంటూ మరో వీడియో విడుదల 
  • భారత్‌కు దొరికిన మరో ఆయుధం

పుల్వామా దాడి తమ పని కాదని, ఆధారాలు ఉంటే చూపించాలంటూ భారత్‌ను డిమాండ్ చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌కు ఆ దేశ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ షాకిచ్చింది. పుల్వామా దాడి తమ పనేనంటూ మరో వీడియోను విడుదల చేసింది. తాము ఎప్పుడు కావాలంటే అప్పుడు పుల్వామా లాంటి దాడిని చేయగలమని అందులో పేర్కొనడం గమనార్హం. పుల్వామా ఆత్మాహుతి దాడి పాక్ పనేనని తొలి నుంచీ ఆరోపిస్తున్న భారత్‌కు ఇప్పుడు మరో ఆయుధం దొరికినట్టు అయింది.  

ఈ నెల 14న సెలవులు ముగించుకొని జమ్ము నుంచి శ్రీనగర్‌ వెళ్తున్న సీఆర్పీఎఫ్‌ బలగాల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 40 మంది సైనికులు అమరులయ్యారు. దాడి తమపనేనంటూ కాసేపటికే జైషే మహ్మద్ వీడియోను విడుదల చేసింది. ఇప్పుడు రెండో వీడియోను విడుదల చేసింది.

jaish e mohammed
Pakistan
Imran Khan
Pulwama Terror Attack
Jammu And Kashmir
  • Loading...

More Telugu News