Galla Jayadev: గెలవలేని వారు పార్టీలు మారడం సహజమే: గల్లా జయదేవ్

  • ఎంపీ రవీందర్ నాకు మంచి స్నేహితుడు
  • గంటల వ్యవధిలోనే పార్టీ మారారు
  • పూర్తిగా అధ్యయనం చేశాకే పార్లమెంటులో మాట్లాడతా

ఎంపీ రవీందర్ తనతో మంచి స్నేహితుడిలా ఉండేవారని, గంటల వ్యవధిలోనే పార్టీ మారిపోయి తనపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మంగళవారం సాయంత్రం తల్లి అరుణకుమారితో కలిసి ఉండవల్లిలో చంద్రబాబును కలిసి జయదేవ్.. ఈ సందర్భంగా కొన్ని ఆలోచనలను ఆయనతో పంచుకున్నారు. అవి విన్న సీఎం భేష్ అంటూ ప్రశంసించారు. అలాగే, ఎన్నికల షెడ్యూలు వచ్చే వరకు రోజుకు రెండు గంటల సమయాన్ని పార్టీ ప్రణాళికల రూప కల్పనకు కేటాయించాలని గల్లాను కోరారు.

అనంతరం విలేకరులతో మాట్లాడిన గల్లా.. గెలవలేని వారు పార్టీలు మారడం చాలా సహజమన్నారు. ఎంపీ రవీందర్ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కాలేదన్నారు. పార్లమెంటు అనేది ఓ కాలేజీ లాంటిదని, ఏదైనా విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేశాకే మాట్లాడతానని చెప్పారు. తాను నిత్యం నేర్చుకుంటూనే ఉంటానని, అందులో తప్పేంటని గల్లా జయదేవ్ ప్రశ్నించారు.

Galla Jayadev
Galla Aruna kumari
Chandrababu
Guntur District
Andhra Pradesh
  • Loading...

More Telugu News