India: యూట్యూబ్ లో ఆధిపత్యం కోసం 'టీ సిరీస్', 'ప్యూడీ పై' హోరాహోరీ
- సబ్ స్క్రయిబర్ల సంఖ్యలో మొనగాళ్లు
- నెంబర్ వన్ స్థానం కోసం తీవ్ర ప్రయత్నాలు
- దూసుకొస్తున్న టీ సిరీస్
ప్రముఖ వీడియో సైట్ యూట్యూబ్ లో ఆధిపత్యం కోసం రెండు చానళ్లు నువ్వా? నేనా? అనే స్థాయిలో పోరాటం కొనసాగిస్తున్నాయి. ఇండియాలో ప్రముఖ మ్యూజిక్ కంపెనీగా పేరుగాంచిన టీ సిరీస్, ప్యూడీపై అనే స్వీడన్ యూట్యూబ్ చానల్ కు మధ్య కొన్నాళ్లుగా అత్యధిక సబ్ స్క్రయిబర్ల విషయంలో ఆన్ లైన్ యుద్ధం జరుగుతోంది. ఈ వార్త రాసే సమయానికి టీ సిరీస్ యూట్యూబ్ చానల్ కు 8, 61, 92, 187 మంది సబ్ స్క్రయిబర్లు ఉండగా, ప్యూడీపై యూట్యూబ్ చానల్ కు 8, 62, 02, 571 మంది సబ్ స్క్రయిబర్లు ఉన్నారు.
ఒకానొక దశలో ప్యూడీపై కంటే వెనుకబడి ఉన్న టీ సిరీస్ ఇప్పుడు సుమారు పదివేల సబ్ స్క్రయిబర్ల దూరంలో నిలిచింది. టీ సిరీస్ ఇదే ఊపును కొనసాగిస్తే మరో వారం రోజుల్లో రెండింటి మధ్య అంతరం మరింత తగ్గిపోతుందని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ రెండు యూట్యూబ్ చానళ్ల అభిమానులు కూడా పరస్పరం కామెంట్లు చేసుకుంటూ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. తమ అభిమాన యూట్యూబ్ చానల్ ను తప్పకుండా సబ్ స్క్రయిబ్ చేసుకోండి అంటూ తమ బంధుమిత్రులకు రికమెండ్ చేస్తున్నారు.