Piyush Ghoyal: అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు ఖరారు... ఎవరికెన్ని సీట్లంటే..!

  • బీజేపీ 5 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది
  • అన్నాడీఎంకే 27, పీఎంకే 7 స్థానాల్లో పోటీ
  • పుదుచ్చేరి ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తాం

 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పొత్తులపై బీజేపీ స్పీడుతో దూసుకుపోతోంది. నిన్న మహారాష్ట్రలోని శివసేనతో పొత్తు ఖరారు చేసుకున్న బీజేపీ.. నేడు తమిళనాడులో అన్నాడీఎంకేతోనూ పొత్తు ఖరారు చేసుకుంది. నేడు అన్నాడీఎంకేతో.. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ భేటీ అయ్యారు. ఈ భేటీలో పొత్తు ఖరారైనట్టు ఆయన తెలిపారు.

నేడు ఆయన తమిళనాడు సీఎం పళనిస్వామితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ, అన్నాడీఎంకే కలిసి పనిచేస్తాయని, ఎన్డీయేలో అన్నాడీఎంకే చేరిక ఖరారైందని పీయూష్ పేర్కొన్నారు. పొత్తులో భాగంగా తమిళనాడులో బీజేపీ 5 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుందని.. అన్నాడీఎంకే 27 స్థానాల్లో, పీఎంకే 7 స్థానాల్లో పోటీ చేస్తాయని పీయూష్ గోయెల్ తెలిపారు. పుదుచ్చేరి ఎన్నికల్లోనూ తాము కలిసి పోటీ చేస్తామని పేర్కొన్నారు.

Piyush Ghoyal
Panneer Selvam
Anna DMK
BJP
Loksabha
PMK
Assembly
  • Loading...

More Telugu News