imran khan: మసూద్ అజార్ ను మీరు పట్టుకోకపోతే.. ఆ పని నేనే చేస్తా: ఇమ్రాన్ కు పంజాబ్ సీఎం సవాల్

  • బహవల్పూర్ లో మసూద్ అజార్ ఉన్నాడు
  • ముంబై దాడులకు సంబంధించిన ఆధారాలు ఇస్తే.. మీరు చేసిందేముంది?
  • ఇమ్రన్ కు కౌంటర్ ఇచ్చిన అమరీందర్ సింగ్

పుల్వామా ఉగ్రదాడిపై ఆధారాలను అందిస్తే.. చర్యలు తీసుకుంటామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పందిస్తూ ఇమ్రాన్ కు కౌంటర్ ఇచ్చారు. 'డియర్ ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ లోని బహవల్పూర్ లో ఐఎస్ఐ సహకారంతో దాడికి వ్యూహరచన చేసిన జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఉన్నాడు. అతన్ని పట్టుకోండి. లేకపోతే ఆ పని మేమే చేస్తాం. ముంబై దాడులకు సంబంధించి ఆధారాలు అందిస్తే... ఇప్పటి వరకు మీరు చేసిందేముంది?' అంటూ అమరీందర్ ట్వీట్ చేశారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా పాకిస్థాన్ ను నిందించడం సరికాదని ఇమ్రాన్ ఈరోజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. భారత్ యుద్ధానికి తెగబడితే తాము కూడా యుద్ధానికి సిద్ధంగానే ఉన్నామని ఆయన చెప్పారు.

imran khan
masood azhar
pulwama
amarinder singh
  • Loading...

More Telugu News