YSRCP: వైఎస్ జగన్ ని కలిసిన అక్కినేని నాగార్జున

  • లోటస్ పాండ్ నివాసంలో జగన్ ని కలిసిన నాగార్జున
  • సుమారు అరగంటపాటు సమావేశం
  • భేటీ ముగిశాక మీడియాతో మాట్లాడని నాగ్

వైసీపీ అధినేత జగన్ ని ప్రముఖ సినీ హీరో నాగార్జున కలిశారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసంలో జగన్ ని ఆయన కలిశారు. అయితే, ఏ విషయమై జగన్ ని నాగార్జున కలిశారన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా, జగన్ తో నాగార్జున భేటీ  సుమారు అరగంట సాగింది. సమావేశం ముగిసిన అనంతరం, జగన్ నివాసం నుంచి బయటకు వచ్చిన నాగార్జునను మీడియా పలకరించింది. అయితే, మీడియాతో నాగార్జున ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోవడం గమనార్హం.

YSRCP
jagan
Tollywood
Nagarjuna
lotus pond
  • Loading...

More Telugu News