Telangana: వివాహ వేడుకలో విషాదం.. విందు వికటించి భైంసాలో 500 మందికి అస్వస్థత

  • పాయసం తిన్న వెంటనే అస్వస్థత
  • వాంతులు, విరేచనాలతో బాధపడిన అతిథులు
  • ప్రాణాపాయం తప్పిందన్న వైద్యులు

అట్టహాసంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. విందులో వడ్డించిన పాయసం తిని 500 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని డీసెంట్ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న పెళ్లిలో వడ్డించిన పాయసాన్ని తిన్న వారు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. వీరి సంఖ్య క్రమంగా వందల్లోకి చేరుకోవడంతో పెళ్లిలో ఒక్కసారిగా కలకలం రేగింది.

అస్వస్థతకు గురైన వారిని వెంటనే భైంసా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు.

Telangana
Nirmal District
bhainsa
Marriage
Food poison
  • Loading...

More Telugu News