Srikakulam District: వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నాయకురాలు కిల్లి కృపారాణి?
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-1a5f380e518790cfbd59255663b0e0e1d76e5a89.jpg)
- వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం
- రేపు ఉదయం జగన్ ని కలవనున్న కృపారాణి
- జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్న నేత
కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత కిల్లి కృపారాణి ఆ పార్టీని వీడనున్నట్టు తెలుస్తోంది. వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. రేపు ఉదయం వైసీపీ అధినేత జగన్ ని ఆమె కలవనున్నట్టు, ఆయన సమక్షంలో వైసీపీ కండువాను కప్పుకోనున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
కాగా, టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కృపారాణి శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా 2004, 2009, 2014లో ఆమె పోటీ చేశారు. అయితే 2009లో మాత్రమే విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో గెలిచిన ఆమె, కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.