raja singh: తెలంగాణ బ్రాండ్ అంబాసడర్ గా సానియామీర్జాను తొలగించాలి: రాజాసింగ్

  • పాకిస్థాన్ కోడలు సానియాను బ్రాండ్ అంబాసడర్ గా తొలగించాలి
  • సింధు, సైనాలాంటి వారిని బ్రాండ్ అంబాసడర్ గా నియమించండి
  • పాకిస్థాన్ తో మనకు సంబంధాలు అవసరం లేదు

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. పాకిస్థాన్ కోడలైన సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసడర్ గా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన విన్నవించారు. తెలంగాణ బిడ్డలైన పీవీ సింధు, సైనా నెహ్వాల్ లాంటి మంచి క్రీడాకారులను బ్రాండ్ అంబాసడర్ గా నియమించాలని కోరారు. పాకిస్థాన్ తో మనకు ఎలాంటి సంబంధాలు అవసరం లేదని చెప్పారు. పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా కేసీఆర్ జన్మదిన వేడుకలను రద్దు చేసుకోవడం అభినందించదగ్గ విషయమని అన్నారు.

raja singh
Sania Mirza
telangana
brand ambassador
kcr
bjp
TRS
  • Loading...

More Telugu News