Kamal Haasan: కశ్మీర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమలహాసన్

  • కశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలన్న కమల్
  • కొన్నేళ్లుగా ఇదే డిమాండ్ చేస్తున్న వేర్పాటువాదులు
  • కమల్ వ్యాఖ్యలను వక్రీకరించారన్న మక్కల్ నీధి మయ్యమ్

కశ్మీర్ అంశంపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లో ప్రజాభిప్రాయం సేకరించాలని ఆయన చెప్పారు. పుల్వామాలో ఉగ్రదాడిపై ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, అక్కడి ప్రజలు కోరుకున్నట్టుగానే అక్కడ చేయాలని పరోక్షంగా వ్యాఖ్యానించారు. కొన్నేళ్లుగా కశ్మీర్ వేర్పాటువాదులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. కమల్ కూడా ఇదే తరహాలో వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను కూడా ఆయన ఆజాద్ కశ్మీర్ అన్నారు.

ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ స్పందించింది. కమల్ వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపింది. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని... మన జవాన్లకు అండగా పార్టీ ఉంటుందని చెప్పింది.

Kamal Haasan
mnm
kashmir
plebicite
  • Loading...

More Telugu News