jagan: జగన్ కు సవాల్ విసిరిన గంటా

  • దమ్ముంటే భీమిలి నుంచి నాపై పోటీ చేయండి
  • లక్ష మెజార్టీతో గెలుస్తా
  • ఇక్కడ కార్యకర్తను కూడా కదిలించలేని దుస్థితిలో వైసీపీ ఉంది

దమ్ముంటే భీమిలి నుంచి తనపై పోటీ చేసి గెలవాలని వైసీపీ అధినేత జగన్ కు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. లక్ష మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుస్తానని చెప్పారు. భీమిలి నియోజకవర్గంలో సామాన్య కార్యకర్తను కూడా కదిలించలేని దుస్థితిలో వైసీపీ ఉందని అన్నారు. కార్యకర్తల మధ్య నెలకొన్న అంతర్గత సమస్యల పరిష్కారం కోసం కోర్ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. భీమిలి నియోజకవర్గ కార్యకర్తలతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

jagan
Ganta Srinivasa Rao
bheemili
Telugudesam
ysrcp
  • Loading...

More Telugu News