Chandrababu: చంద్రబాబు సత్య హరిశ్చంద్రుడని సపోర్ట్ చేయలేదు: నాగబాబు

  • చంద్రబాబు-జగన్ ఇద్దరూ అవినీతి పరులే
  • అనుభవం ఉన్న నాయకుడని చంద్రబాబుకు మద్దతు
  • అప్పట్లో పవన్‌కు వేరే ఆప్షన్ లేకుండా పోయింది

గత ఎన్నికల్లో అనుభవం ఉన్న నాయుకుడనే చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చాడు తప్ప ఆయనో సత్య హరిశ్చంద్రుడని సపోర్ట్ ఇవ్వలేదని పవన్ సోదరుడు నాగబాబు అన్నారు. చంద్రబాబు-జగన్ ఇద్దరూ అవినీతిపరులేనని, అయితే ఆ సమయంలో అనుభవం ఉన్న చంద్రబాబు తప్ప పవన్‌కు మరో ఆప్షన్ లేకుండా పోయిందని అన్నారు.

ప్రజా సమస్యలపైనే చంద్రబాబుతో పవన్ కలిశారని పేర్కొన్న నాగబాబు ఎన్నికల తర్వాత చాలా విషయాల్లో చంద్రబాబుతో విభేదించినట్టు చెప్పారు. అంతేతప్ప టీడీపీతో కలిసి పనిచేశారని చెప్పడం తప్పన్నారు. 2014లో వైసీపీకి వేవ్ ఉందని, టీడీపీకి లేదని అన్నారు. ఆ గాలిని పవన్ టీడీపీవైపు టర్న్ చేశారని నాగబాబు పేర్కొన్నారు.

Chandrababu
Naga babu
mega brother
YSRCP
Jagan
Pawan Kalyan
  • Loading...

More Telugu News