Naga babu: పవన్ ప్యాకేజీలు తీసుకుంటాడా?.. చెప్పుతో కొడతా!: ఆగ్రహంతో శివాలెత్తిన నాగబాబు

  • మాట్లాడేముందు ‘బీప్’ సౌండ్ వేసుకోవాలన్న నాగబాబు
  • పవన్‌కు ప్యాకేజీలు తీసుకునే ఖర్మ లేదన్న మెగా బ్రదర్
  • ఏడాదికి రూ.150 కోట్లు సంపాదించే సత్తా పవన్‌కు ఉందని వ్యాఖ్య

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్యాకేజీలు తీసుకుంటున్నారంటూ వస్తున్న ఆరోపణలపై ఆయన సోదరుడు నాగబాబు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఆరోపణలు చేస్తున్నవారిపై బూతులతో విరుచుకుపడ్డారు. పవన్‌ ప్యాకేజీలు తీసుకుంటున్నారని, ప్యాకేజీలు లేకుండా ఆయనే పనీ చేయరన్న ఆరోపణలపై మీ స్పందన ఏంటన్న ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు నాగబాబు వీరంగమేశారు.  

తాను మాట్లాడేవాటికి ‘బీప్’ సౌండ్ వేసుకోవాలంటూ ముందే చెప్పిన నాగబాబు ఆ తర్వాత తన నోటికి పని చెప్పారు. పవన్‌పై ప్యాకేజీ కామెంట్ చేసే వారిని తాను బాస్టర్డ్స్ అంటానంటూ బూతులతో మొదలుపెట్టిన నాగబాబు అటువంటి ఆరోపణలు చేసే వారిని చెప్పుతో కొడతానని హెచ్చరించారు.

 ‘‘కల్యాణ్ బాబు ప్యాకేజీలు తీసుకున్నారా? ఆయనకా అవసరం ఏంటి? వాళ్లు ఇచ్చేది ఎంత? పవన్ సినిమాలు చేస్తే ఏడాదికి రూ.150 కోట్లు సంపాదించే సత్తా పవన్‌కు ఉంది’’ అని ఆగ్రహంతో ఊగిపోయారు. మరోసారి ఇటువంటి కామెంట్లు చేసేవారిని చెప్పుతో కొడతానని హెచ్చరించారు.

Naga babu
Pawan Kalyan
Jana sena
Package
Andhra Pradesh
Mega star
  • Loading...

More Telugu News