West Indies: విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ సంచలన నిర్ణయం

  • గత కొంతకాలంగా ఆడడం తగ్గించేసిన గేల్
  • ప్రపంచకప్ తర్వాత వన్డేలకు గుడ్‌బై
  • స్వయంగా ప్రకటించిన విండీస్ బోర్డు

విండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మేలో ప్రారంభం కానున్న ప్రపంచకప్ అతడికి చివరి టోర్నీ కానుంది. ఆ తర్వాత వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. మెగా టోర్నీ తర్వాత గేల్ వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు విండీస్ క్రికెట్ బోర్డు స్వయంగా ప్రకటించింది. బోర్డుతో వివాదాల కారణంగా గేల్ ఇటీవల జాతీయ జట్టుకు ఆడడం బాగా తగ్గించేశాడు. గతేడాది జూలైలో చివరిసారిగా గేల్ వన్డే ఆడాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 284 వన్డేలు ఆడిన గేల్ 9,727 పరుగులు చేశాడు.  

West Indies
Chris gayle
cricket world cup
One-day match
  • Loading...

More Telugu News