Cricket: ఒక్కసారే 58 ప్లేసులు జంప్ చేసిన శ్రీలంక క్రికెటర్

  • ఐసీసీ ర్యాంకుల్లో 40వ స్థానంలో కుశాల్ పెరెరా
  • సౌతాఫ్రికాపై సంచలన ఇన్నింగ్స్ ఫలితం
  • కోహ్లీకి టాప్ ర్యాంక్

ఐసీసీ తాజాగా ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకుల్లో ఈసారి ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. నిన్నమొన్నటిదాకా అనామకుడిగా ఉన్న శ్రీలంక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ కుశాల్ పెరెరా టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఒక్కసారే 58 స్థానాలు అధిగమించి 40వ ర్యాంకు సాధించాడు. కుశాల్ పెరెరాకు ఇది కెరీర్ బెస్ట్ ర్యాంక్. పెరెరా ఇప్పటివరకు ఆడింది 15 టెస్టులే. అయితే దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో సంచలన బ్యాటింగ్ తో 153 పరుగులు చేసి శ్రీలంక జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్ తో పెరెరా ర్యాంకు ఒక్కసారిగా పైకి ఎగబాకింది.

ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. కోహ్లీ ఖాతాలో 922 పాయింట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ 897 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియాకే చెందిన మరో బ్యాట్స్ మన్ ఛటేశ్వర్ పుజారా మూడోస్థానంలో ఉన్నాడు. టెస్ట్ క్రికెట్ బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ అగ్రస్థానానికి ఎగబాకాడు. దక్షిణాఫ్రికా సీమర్ కగిసో రబాడాను వెనక్కి నెట్టిన టాప్ ర్యాంక్ చేజిక్కించుకున్నాడు కమిన్స్. బౌలర్ల జాబితాలో భారత్ నుంచి రవీంద్ర జడేజా ఐదో స్థానంలో ఉన్నాడు. జడేజా ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో మూడో స్థానం దక్కించుకున్నాడు.

  • Loading...

More Telugu News