Reliance Jio: 4జీ డౌన్ లోడ్ స్పీడ్ లో టాప్ కంపెనీలివే!

  • తొలి స్థానంలో రిలయన్స్ జియో
  • డౌన్ లోడ్ స్పీడ్ 18.7 ఎంబీపీఎస్
  • రెండో స్థానంలో ఎయిర్ టెల్
  • అప్ లోడ్ స్పీడ్ లో ఐడియా ఫస్ట్

ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) విడుదల చేసిన జనవరి నెల గణాంకాల ప్రకారం, ఇండియాలో 4జీ డౌన్ లోడ్ స్పీడ్ లో రిలయన్స్ జియో తొలి స్థానంలో నిలిచింది. మిగతా టెలికం సేవల సంస్థలతో పోలిస్తే, జియో డౌన్ లోడ్ స్పీడ్ 18.8 ఎంబీపీఎస్ అని, ఇదే అత్యధికమని తెలిపింది. డిసెంబర్ లో 18.7 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ వేగంతో ఉన్న జియో, మరో 100 కేబీపీఎస్ వేగాన్ని పెంచుకుందని తెలిపింది. దీంతో సరాసరిన 2018లోని అన్ని నెలల్లో జియో డౌన్ లోడ్ వేగంలో తొలి స్థానంలో నిలిచినట్లయింది.

ఇక జియోకు ప్రధాన పోటీదారు ఎయిర్ టెల్ విషయానికి వస్తే, డిసెంబర్ లో 9.8 ఎంబీపీఎస్ గా ఉన్న వేగం, జనవరిలో 9.5 ఎంబీపీఎస్ కు పడిపోయింది. వోడాఫోన్ నెట్ వర్క్ వేగం 6.3 ఎంబీపీఎస్ నుంచి 6.7 ఎంబీపీఎస్ కు మెరుగుపడింది. ఐడియా వేగం 6 ఎంబీపీఎస్ నుంచి 5.5 ఎంబీపీఎస్ కు తగ్గింది.

కాగా, అప్ లోడ్ వేగంలో మాత్రం ఐడియా ముందు నిలవడం గమనార్హం. జనవరిలో అప్ లోడ్ వేగంలో ఐడియా 5.8 ఎంబీపీఎస్ తో తొలి స్థానంలో ఉండగా, వోడాఫోన్ అప్ లోడ్ వేగం 5.4 ఎంబీపీఎస్ గా, జియో స్పీడ్ 4.4 ఎంబీపీఎస్ గా ఉంది. ఎయిర్ టెల్ 3.8 ఎంబీపీఎస్ అప్ లోడ్ స్పీడ్ తో నాలుగో స్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News